Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలువరదలో కొట్టుకుపోయిన ఆటో.. ఇద్దరు గల్లంతు

వరదలో కొట్టుకుపోయిన ఆటో.. ఇద్దరు గల్లంతు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఉధృతంగా వచ్చిన వరద నీరు ఇద్దరి ప్రాణాలను తీసింది. ఆటోలో కాలువ దాటుతుండగా వరదలో కొట్టుకు పోయారు. దాదాపు నాలుగు గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడారు. దురదృష్టం వెంటాడి వరద ఉధృతికి స్తంభం కూలిపోవడంతో ఇద్దరు గల్లంతైన ఒకరి మృతదేహం లభ్యమైంది. హవేలీ ఘనపూర్ మండలం రాజీ పేట కు చెందిన యాదా గౌడ్, సత్యనారాయణ లు మెదక్ హాస్టల్ లో ఉన్న పిల్లలను తీసుకు వచ్చేందుకు ఆటోలో వస్తుండగా వాడి, రాజీపేట బ్రిడ్జిపై నుంచి వరద పారుతుంది.

ఓ మోస్తారులో నీటి ప్రవాహం ఉండడంతో భావనతో ఆటో తీశారు. అదే సమయంలో పై నుంచి ఉధృతంగా వరద రావడంతో ఇద్దరు కొట్టుకుపోయారు. అదే వేగంలో వాగులో ఉన్న స్తంభం ఎక్కి దాదాపు నాలుగు గంటల పాటు సహాయం కోసం చూశారు. ఉధృతంగా వాగు పారుతుండడంతో ఇద్దరు ఉన్న స్తంభం కూలిపోయింది. దీంతో నీటిలో కొట్టుకుపోయారు. వారిలో సత్యనారాయణ మృతదేహం లభ్యం కాగా యాదా గౌడ్ కోసం గాలిస్తున్నారు. మృతుల కుటుంబాలను మాజీ మంత్రి పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -