Sunday, December 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అసెంబ్లీ సమావేశాల్లోనే ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

అసెంబ్లీ సమావేశాల్లోనే ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

- Advertisement -

– ఆటో జేఏసీ రాష్ట్ర నాయకుల
నవతెలంగాణ –  కామారెడ్డి
మాకు ప్రభుత్వాలు ఉపాధి చూపకపోయినా మా కాళ్ళపై మేము నిలబడి ఆటోలు నడుపుకొని బ్రతుకుతుంటే మా నోటికాడు కూడును గుంజేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం అని ఆటో జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. హైదరాబాద్ పరిధిలో 45 వేల ఆటోలకు పర్మిట్లు ఇచ్చి అవినీతికి, బ్రోకర్ల దందాకు తెరలేపిందని దీనిని వెంటనే మార్పులు చేసి అర్హులకే ఆటోల పర్మిట్లు ఇవ్వాలని లేదంటే ఆర్టీవో కార్యాలయాలు ముట్టడిస్తామని   హైదరాబాద్  హైదర్ గూడా ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆటో జేఏసీ రాష్ట్ర నాయకుల రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే దస్తగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగుడాల సాయిలు మాట్లాడుతూ  ఆటో డ్రైవర్లకు జీవన భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచిపోయినా  ఇంతవరకు ఆటో డ్రైవర్ల ప్రస్తావనే తీసుకురాలేదని, మహిళలకు ఆర్టీసీ ఫ్రీ తీసుకురావడం వల్ల ఆటోల్లో మహిళలు ఎక్కడమే మానేశారని తద్వారా ఆటోలు ఉపాధి కోల్పోయి, అప్పుల పాలై ఇప్పటివరకు వందకు పైగా ఆటో డ్రైవర్ లు ఆత్మహత్య చేసుకున్నారని వీటన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని, ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆటో సంక్షేమ బోర్డు, 12 వేల రూపాయల హామీలను నెరవేర్చాలని లేదంటే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించి ధర్నాలు, రాస్తారోకోలు చేయవలసి వస్తుందని నాయకులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -