రూ.56 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్ : శాటిలైట్ కమ్యూనికేషన్స్, రక్షణ ఎలక్ట్రానిక్స్ రంగంలోని అవాంటెల్ లిమిటెడ్ తన ఏరోస్పేస్, రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో తన సామర్థ్యాలను విస్తరించడానికి హైదరాబాద్‌లో తన రెండవ కేంద్రాన్ని ప్రారంభించింది. 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అవాంటెల్ లిమిటెడ్ డైరెక్టర్ సిద్ధార్థ అబ్బూరి తెలిపారు. సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలు, రాడార్ వ్యవస్థలు, శాటిలైట్ ఇంటిగ్రేషన్ డిజైన్, అభివృద్ధి, తయారీపై దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. రూ.56 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ కొత్త కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తమ సామర్థ్యాలను విస్తరిస్తోన్నామన్నారు. ఈ కేంద్రం ప్రారంభం కంపెనీ వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో అవాంటెల్ మరో కేంద్రం ఏర్పాటు
- Advertisement -
- Advertisement -