Saturday, July 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘనంగా అవికా గోర్ నిశ్చితార్థం

ఘనంగా అవికా గోర్ నిశ్చితార్థం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు టీవీ ప్రేక్షకులకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా పరిచయమై… సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా దగ్గరైన యువనటి అవికా గోర్ తన జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టానికి అడుగులు వేశారు. తన ప్రియుడు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీని పెళ్లాడబోతున్నారు. మిలింద్ తో నిశ్చితార్థం జరిగినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా అవికా షేర్ చేశారు. ఒక ఫొటోలో మిలింద్ చేతిని పట్టుకుని ఆనందంగా నవ్వుతూ కనిపించగా, మరో ఫొటోలో మిలింద్ బుగ్గపై ముద్దుపెడుతూ తన ప్రేమను వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -