జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య
నవతెలంగాణ – జన్నారం
2022, 2023 సంవత్సరాలలో ఉర్దూ ఉపాధ్యాయులుగా విశేష సేవలు అందించిన వారికి తెలంగాణ ఉర్దూ అకాడమీ ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డులను అందించడం జరిగింది. ఈ క్రమంలో జిల్లాలోని జన్నారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రజియా భాను అవార్డు పొందారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 మంది ఉపాధ్యాయులు ఈ గౌరవాన్ని పొందారని, నిబద్ధతతో పని చేసి సేవలు అందించిన వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎ. లక్ష్మణ్ కుమార్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ ల చేతుల మీదుగా ప్రశంసా పత్రం తో పాటు 25 వేల రూపాయల నగదు బహుమతి అందించారని తెలిపారు. రజియా భాను పాఠశాలలో నాణ్యమైన ఉర్దూ బోధన తో పాటు విద్యార్థుల భాష నైపుణ్యాలు, సాంస్కృతిక విలువలు పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారని, పిల్లల సంరక్షణ కొరకు చైల్డ్ కేర్ కార్యక్రమాలు నిర్వహించి, తాత్కాలిక భవనాల స్థానంలో శాశ్వత భవనాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారని తెలిపారు.
ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయురాలికి అవార్డు ప్రధానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES