నాలుగు ప్రధాన విభాగాల్లో టాప్ అచీవర్ గౌరవం : అవార్డును స్వీకరించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను బలోపేతం చేయడానికి బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్(బీఆర్‌ఏపీ)- 20024 ఎడిషన్‌లో నాలుగు ప్రధాన విభాగాల్లో టాప్ అచీవర్ గౌరవాన్ని తెలంగాణ సాధించింది. బిజినెస్ ఎంట్రీ, కన్‌స్ట్రక్షన్ పర్మిట్ ఎన్‌బ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో అవార్డు లను దక్కాయి.
వాటిని మంగళవారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ స్వీకరించారు. బీఆర్‌ఏపీ2024 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాన సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినది. అంతే కాకుండా 13 శాఖల్లో 1467 కాంప్లయెన్స్‌ను తగ్గించింది. దీని ద్వారా సమర్థవం తమైన పరిపా లన, పారదర్శకత, వ్యాపారానుకూల వాతావా రణం తెలంగాణలో ఉందని బీఆర్‌ఏపీ గుర్తించింది. వ్యాపార సౌలభ్యాన్ని పెంపొం దించడానికి విస్తృత మైన సంప్రదింపులు, వాటాదా రుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన బీఆర్‌ఏపీ-2024లో 434 రీఫార్మ్ పాయింట్లు ఉన్నాయి. ఇవి కార్మిక చట్టాలు, భూ సంవహన పరిపాలన, ఆస్తి రిజిస్ట్రేషన్, పెట్టుబడి సౌకర్యాలు, పర్యావరణ అను మతుల వంటి కీలక అంశాలను కవర్ చేస్తాయి.
బీఆర్‌ఏపీ-2024లో తెలంగాణకు అవార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



