నవతెలంగాణ – కంఠేశ్వర్
పండరి శక్తి ఫౌండేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజాంబాద్ ధాత్రి ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తంగా క్యాన్సర్ నివారణ కొరకు రక్త లాలాజల సేకరణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివేకానంద ఆడిటోరియం గంగస్థాన్ పేస్ 2 లో ఆదివారం నిర్వహించారు. శ పుష్పలత పవర్ ఈ కార్యక్రమాన్ని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజాంబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విచ్చేసి లాలాజలం సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండరి శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు కుమారి గౌరీ పవర్, రిక్రాస్ సొసైటీ చేపట్టిన స్టెమ్ సెల్ దానం చేసి ఒక ప్రాణానికి జీవితం ఇచ్చి పనిలో భాగస్వామ్యం అవుదాం అని ఎమ్మెల్యే అభినందించారు గౌరవ అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధమంగా జిల్లాల్లో క్యాన్సర్ మరియు తలసీమియా బాధితుల కోసం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని భవిష్యత్తులో కూడా ఇంకా జిల్లావ్యాప్తంగా లాలాజల సేకరణ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు ధాత్రి ఫౌండేషన్ ప్రతినిధి రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాత్రి ఫౌండేషన్ 6 లక్షల శాంపిల్స్ సేకరించిందని దీంట్లో 1500 మంది యొక్క లాలాజల డిఎన్ఏ క్యాన్సర్ బాధితుల సరిపోయిందని ఇంకా 7000 మంది క్యాన్సర్ బాధితులు రక్త స్టెమ్ సెల్ దానం కోసం వేచి చూస్తున్నారని అన్నారు.
ఈరోజు హాజరైన ప్రతి ఒక్కరు కూడా అభినందనీయులని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి లాలాజ సేకరణకు అందరికీ అభినందనలు గతంలో బోన్ మారో నుండి సేకరించి క్యాన్సర్ రోగులకు అందించే వారిని కానీ ప్రస్తుతం బ్లడ్ డొనేషన్ లాగానే తీసుకొని దాంట్లో నుండి రక్త స్టెల్ సేమ్ మాత్రమే అందిస్తున్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోటరాజశేఖర్ మాట్లాడుతూ.. పండరీ శక్తి ఫౌండేషన్ కుమారి గౌరీ పవర్ వారి కుటుంబంలో క్యాన్సర్ బారిన చనిపోవడంతో క్యాన్సర్ పై పోరాటానికి కార్యక్రమాన్ని చేపట్టారు. అభినందనీయం మనమందరం కూడా కలిసికట్టుగా ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం దానం చేసి ఒక ప్రాణానికి జీవితాన్ని ఇచ్చే పనిలో భాగస్వామ్యం అవుదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కుమారి గౌరీ పవర్, ధాత్రి ఫౌండేషన్ రవీంద్రనాథ్, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్, సాయి ప్రసాద్, అధ్యక్షులు రామకృష్ణ సేవా సమితి కోశాధికారి కరీపే రవీందర్, బంటు రాము, మాజీ కార్పొరేటర్ కృష్ణ పటేల్, బీజేవైఎం చిరు కల్పే రాజ్ కుమార్ సుబేదార్, హనుమంతరావు పవర్, అశోక్ పవర్, నరసింహ పవర్ 100 మంది పాల్గొన్నారు అర్హులైన 70 మంది నుండి జల సేకరణ చేయడం జరిగింది.