Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్ర పై విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు అవగాహన కల్పించారు. మండలంలోని కూనేపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కీటక జనిత వ్యాధులు దోమల నివారణ, దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు సిహెచ్ శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -