Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన 

విద్యార్థులకు హెచ్ఐవిపై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని ప్రాజెక్టు నగర్  గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జెడ్పిహెచ్ఎస్  బాలికల ఉన్నత పాఠశాలలో  8,9, 10 తరగతి విద్యార్థులకు వై ఆర్ జి  కేర్ సంస్థ లింక్ వర్కర్  టీ. కిషన్  విద్యార్థులకు  హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ.. హెచ్ఐవి వ్యాధి నాలుగు మార్గాల ద్వారానే వస్తుంది.  అవి  1) సురక్షితం కాని లైంగిక సంబంధాల వల్ల  2) కలుషితమైన సూదులు ఇంజక్షన్ల ద్వారా   3) పరీక్షించని రక్తమార్పిడి వల్ల  4 హెచ్ఐవి తల్లి నుండి పుట్టబోయే బిడ్డకి  ఈ నాలుగు మార్గాల ద్వారానే వస్తుందని చెప్పారు.

ఎయిడ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి  ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలి  అని చెప్పారు. హెచ్ఐవి వ్యాధికి  ఏ ఆర్ టి  మందులు  జీవితకాలం పెంపొందించుకోవడానికి  ఈ మందులు ఉన్నాయి. హెచ్ఐవి పేషెంట్లను  ప్రేమతో ఆదరిద్దాం  వారిపై వివక్షత చూపకూడదు  అని చెప్పారు ఈ కార్యక్రమంలో  హెడ్మాస్టర్  ఇంచార్జ్    విజయ  ప్రధానోపాధ్యాయులు  పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad