నవతెలంగాణ – పెద్దవూర
అనుముల ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఉదయ శ్రీ,చలకుర్తి సెక్టార్ సూపర్ వైజర్ గౌసియా బేగం అధ్యక్షతన శుక్రవారం మండలంలోని ఊరబావి తండా అంగన్వాడీ సెంటర్లలో పోషణ పక్వాడ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ ఉదయశ్రీ సూపరమాట్లాడుతూ ఈ నెల 30 వరకు అన్నీ అంగన్‌వాడీ కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. గర్భవతిగా నిర్దారణ అయినప్పటి నుంచి బిడ్డపుట్టి రెండు సంవత్సరాలు నిండే వరకు వేయి రోజుల పాటు పిల్లలకు మంచి పౌష్టికాహారం, సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని తెలిపారు. పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల పోషకాహార లోపాలను తగ్గించడానికి అంగన్వాడీ కేంద్రాలు సహకరిస్తాయని తెలిపారు.అంగన్‌వాడీ కేంద్రాల లోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని అన్నారు.పోషణ అభియాన్, పోషణమాసం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పోషణ పక్వాడపై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES