- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్(రాజంపేట్):
రాజంపేట్ పట్టణ కేంద్రంలో గోల్డెన్ రాక్ హౌసింగ్ కన్‌స్ట్రక్షన్ అధ్వర్యంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్‌స్ట్రక్షన్ ప్రతినిధి ఇంజనీర్ రాజశేఖర్ లబ్ధిదారులకు ప్రాజెక్టర్, వాయిస్ సిస్టమ్ ద్వారా నిర్మాణ విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీఓ జబెర్ ఇమాదుద్దిన్ అహ్మద్, హౌసింగ్ డిప్యూటీ ఈఈ సుష్మ, ఏఈ మహేష్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



