Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవృద్ధుల ఆరోగ్యంపై అవగాహన అవసరం

వృద్ధుల ఆరోగ్యంపై అవగాహన అవసరం

- Advertisement -

– రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తు
– జేరియాట్రిక్‌ కేర్‌ ప్రారంభంపై నిమ్స్‌లో అవగాహనా కార్యక్రమం
నవతెలంగాణ-సిటీబ్యూరో

వృద్ధుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సామాజిక మద్దతు, ప్రభుత్వ వైద్య సేవల కల్పన అంశాలపై అవగాహన పెంచడం చాలా అవసరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తు అన్నారు. హైదరాబాద్‌ పంజాగుట్ట నిమ్స్‌లో జేరియాట్రిక్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ వైఎస్‌ఎన్‌.రాజు ఆధ్వర్యంలో శుక్రవారం ”తెలంగాణ రాష్ట్రంలో జేరియాట్రిక్‌ కేర్‌ ప్రారంభానికి అవగాహన” కార్యక్రమం నిర్వహించారు. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ ట్రామా ఆడిటోరియంలో జరిగిన ఈ కారక్రమంలో క్రిస్టినా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధుల వైద్య సంరక్షణ ప్రాముఖ్యతపై నిపుణులు సమగ్ర చర్చలు జరపడం సంతోషకరమన్నారు. డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వృద్ధుల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వృద్ధుల కోసం ప్రత్యేక జేరియాట్రిక్‌ విభాగాల విస్తరణ, వైద్య సిబ్బందికి శిక్షణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సేవల విస్తరణపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్యం జీవన దశ కాదని, అనుభవం, గౌరవానికి ప్రతీకగా చూడాలని అన్నారు. నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీరప్ప మాట్లాడుతూ.. నిమ్స్‌ నిపుణ వైద్యులు ఈ కార్యక్రమంలో విలువైన ప్రసంగాలు, చర్చలు, మార్గదర్శక సూచనలు అందించారని తెలిపారు. వృద్ధాప్య దశలో అవసరమైన ప్రత్యేక వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డైటీషియన్‌ షాలిని, హెల్ప్‌ ఏజ్‌ ఇండియా జాయింట్‌ డైరెక్టర్‌ వి.యతీంద్ర, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రేణు పూజిత, వివిధ ఆస్పత్రుల మెడికల్‌ సూపరింటెండెంట్లు, పలు జిల్లాల నుంచి జేరియాట్రిక్‌ మెడిసిన్‌ వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -