Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్యవివాహాల నివారణ చట్టంపై అవగాహన

బాల్యవివాహాల నివారణ చట్టంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
మేడిపల్లి ఆశ్రమ పాఠశాలలో శనివారం బాల్యవివాహాల నివారణ చట్టంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ అధికారి మల్లేశ్వరి మాట్లాడుతూ…బాల్యవివాహాలు తీవ్రమైన సామాజిక సమస్య అని, చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. చట్ట ప్రకారం బాల్యవివాహాలు నేరమని, వాటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు వివరించారు.

అలాగే చిన్నారులు ఏదేని ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా సహాయం అవసరం ఉన్నప్పుడు సంప్రదించేందుకు 1098 చిన్నారుల సహాయ టోల్ ఫ్రీ నంబర్‌ పై పూర్తి సమాచారం అందించారు. ఏవైనా సమస్యలు, వేధింపులు లేదా అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే 1098 కు కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సందేహాలను తీర్చారు. విద్య, భద్రత, ఆరోగ్యం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. చిన్నారుల హక్కుల పరిరక్షణలో సమాజం మొత్తం కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సిడిపిఓ రాధిక, సిహెచ్ఎల్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి, అనూష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -