- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో గురువారం రోజు షీ టీం కానిస్టేబుల్ సుప్రజా, శ్రీశైలం విద్యార్థులకు మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్ రోడ్డు భద్రత, మహిళల రక్షణ, కర్తవ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినిలు తమకు ఏవైనా ఇబ్బందులు కలిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 8712686094 సైబర్ క్రైమ్ జరిగినట్టయితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కాల్ చేయాలన్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్టయితే 100 నంబర్కు డయల్ చేయాలని వారు పేర్కొన్నారు.
- Advertisement -