నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం కస్తూర్బా గాంధీ ఆశ్రమ పాఠశాల బాలికల విద్యాలయంలో చదువుతున్న ఒకేషనల్ ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కోర్స్(ఇంటర్న్ప్ క్లాసెస్)లో భాగంగా ఒకేషనల్ ట్రెయినర్ తేజ ఆధ్వర్యంలో వైద్యులు అందజేస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. కోర్స్ లో భాగంగా మండల కేంద్రమైన తాడిచర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత రెండు రోజుల నుంచి విద్యార్థులు సందర్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో వైద్యసిబ్బంది రోగులకు అందజేస్తున్న వైద్యం, చికిత్స తీరును విద్యార్థులు పరిశీలించారు. అలాగే వైద్య సిబ్బందితో కలిసి రోగులకు బీపీ, జ్వర పరీక్షల తీరులో శిక్షణ పొందుతున్నారు. రెండు నెలలపాటు వైద్య సేవలపై విద్యార్థులు శిక్షణ తీసుకోనున్నట్లు తేజ తెలిపారు.
ఒకేషనల్ విద్యార్థులకు ఆరోగ్య కేంద్రంలో అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



