Thursday, October 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన

అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం పురస్కరించుకొని అంగన్వాడి కార్యకర్తలకు మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ లు అవగాహన కల్పించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఈనెల 11 నుంచి 18 వరకు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు, ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు స్త్రీ పురుషులు అందరికీ ఈ మాత్రాలను పంపిణీ చేయాలని వారు సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు అంగన్వాడి చిన్నారులకు సైతం సోమవారం నుండి నులిపురుగుల మాత్రలను అందజేయడానికి, విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని వారన్నారు.

మండల స్థాయి అధికారులతో పాటు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు ప్రతి గ్రామంలో పర్యటించి వారికి అవగాహన కల్పించడంతోపాటు చిన్నారులకు మాత్రలను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్, ఎంపీడీవో వి కమలాకర్, డాక్టర్ సహిస్తా పీర్దోస్, ఎంపీఓ రఫీ హైమద్, ఆయుష్ డాక్టర్ ప్రమోదిత, గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు, ఐ సిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -