Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లిల్లీపుట్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన

లిల్లీపుట్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
పట్టణంలోని లిల్లీ పుట్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఎమ్మార్ గార్డెన్ లో పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సైకాలజిస్ట్  పేరెంటింగ్ కోచ్  శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సైకాలజీ  పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యత వహించాలి.. అంతేకాకుండా ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలక పాత్ర పోషిస్తుందని పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించాలని అవగాహన కల్పించారు.

ప్రతి విషయంలో పిల్లలపై కోపగించుకోవద్దని,వారిని దోషులుగా చూడకుండా, వారి సున్నితమైన మనస్సుకు తగ్గట్లు తల్లిదండ్రులు ప్రవర్తించాలని సూచించారు. అంతేకాకుండా చదువు పట్ల నైతిక విలువలు విద్యార్థుల్లో రూపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. ఇలాంటి చాలా ప్రాముఖ్యమైన ఆసక్తికరమైన విషయాలను తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులకు ఒక ఆట ద్వారా లక్కీ డ్రా చేయించి వారిలో విజేతలుగా అయినా వారికి బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ.. పేరెంట్ అవగాహన సదస్సు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ మొత్తంలో హాజరయ్యారని, వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రస్తుత సమాజంలో విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. వారి బిజీ షెడ్యూల్లో పిల్లలకు తగిన సమయానికి విషయాలను గురించి పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా తమ ఎన్నో విషయాలు నేర్చుకున్నామని వెల్లడించారు. ప్రతి విషయంలో లిల్లీపుట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ప్రతి దానిలో తోడుగా ఉంటుందని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడుతారని పాఠశాలను పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు ముఖ్యఅతిథి సైకాలజిస్ట్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -