Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రసూతి, నవజాత శిశు అత్యవసర సంరక్షణపై అవగాహన

ప్రసూతి, నవజాత శిశు అత్యవసర సంరక్షణపై అవగాహన

- Advertisement -

– రెయిన్ బో చిల్డ్రన్స్ ఆసుపత్రి వైద్య బృందం..
నవతెలంగాణ – బంజారా హిల్స్

రెయిన్‌బో చిల్డ్రన్స్ ఆస్పత్రి, నిజామాబాద్ ఆబ్‌స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సంయుక్తంగా, నిజామాబాద్ ప్రసూతి, గైనకాలజికల్ సొసైటీ సహకారంతో ‘ప్రసూతి, నవజాత శిశు అత్యవసర సంరక్షణ’పై సీఎంఈ, హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాప్ ను హోటల్ వంశీ ఇంటర్నేషనల్ లో అవగాహన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు చర్చ వేదికలో ముఖ్య సూచనలు చేశారు. ప్రధానంగా గైనకాలజీ, నియోనాటాలజీ, అనస్థీషియాలజీ, ఫీటల్ మెడిసిన్ నిపుణులు పాల్గొని, అత్యవసర సందర్భాల్లో చికిత్సా విధానాలపై శిక్షణ ఇచ్చారు. నియోనాటల్ రీససిటేషన్‌ను డాక్టర్ కీర్తి వివరించగా, రక్తస్రావం, ఎక్లాంప్సియా, షోల్డర్ డిస్టోసియా, రక్త మార్పిడి నిర్వహణపై ఆచరణాత్మక శిక్షణ జరిగింది.

ప్రముఖ వైద్యులు డాక్టర్ శిరీష ప్రమత, డాక్టర్ అపర్ణ కప్పగంతుల, డాక్టర్ శ్రీలత పట్నాయక్ (గైనకాలజిస్టులు), డాక్టర్ మాధవ్ (అనస్థీటిస్ట్), డాక్టర్ కీర్తి (నియోనాటాలజిస్ట్), డాక్టర్ హిమబిందు (ఫీటల్ మెడిసిన్) చర్చల్లో పాల్గొని,తమ అనుభవాన్ని కలసి  పంచుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లి, శిశు మరణాల రేటు తగ్గించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రెయిన్బో ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

మరింత సమాచారం కోసం [email protected]www.rainbowhospitals.in సందర్శించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -