- Advertisement -
ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య..
నవతెలంగాణ – రెంజల్
తల్లిపాల వారోత్సవంలో భాగంగా రెంజల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల ప్రాముఖ్యతపై తల్లులకు అవగాహన కల్పించినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌజన్య పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రు పాలు రోగనిరోధక శక్తి పెంచుతుందన్నారు. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరం ఆమె తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సుజాత, పద్మ, రాజ్యలక్ష్మి, రజిని, ఆరోగ్య కార్యకర్త జానకి, విజయ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -