Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూనె గింజల సాగుతో తేనెటీగల పెంపకంపై అవగాహన

నూనె గింజల సాగుతో తేనెటీగల పెంపకంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
నూనె గింజల సాగుతో తేనె టీగల పెంపకాన్ని అనుసంధానించడం పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కాటారం మండల కేంద్రంలోగల మార్కెట్ కమిటీలో బుధవారం జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్.ఐ పి హెచ్ ఎం) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం నవంబరు 20వ తేదీన ప్రారంభం కాగా 26 తారీకు బుధవారం ఆరు రోజులపాటు నిర్వహించడం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని జాతీయ తేనెటీగల బోర్డు (ఎన్ బి బి) మద్దతు ఇచ్చింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎంసీ చైర్ పర్సన్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నూనె గింజల సాగుతో తేనెటీగల పెంపకాన్ని అనుసంధానించడం ద్వారా పంట దిగుబడులు పెరగడమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని, తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని అన్నారు. ఉత్పత్తికి అనువైన ప్రదేశాలు, పంటల ఎంపికపై అనుభవం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి శక్తి వెల్, డాక్టర్ పైల జ్యోతి, శ్రీ నేచురల్ హనీ  కరీంనగర్ వ్యవస్థపాకురాలు తాళ్లపల్లి సంజన పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -