చైల్డ్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ గుర్రం తిరుపతి
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి సూచన మేరకు డిహెచ్ఈడబ్ల్యూ,బిఆర్బి శక్తి విభాగాల సమన్వయంతో మండలంలోని వల్లెంకుంట ప్రభుత్వ పాఠశాలలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా గుర్రం తిరుపతి తెలిపారు. ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించడం కొరకు ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నెంబర్లు 1098,181,1930, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా నవ సమాజ నిర్మాణానికి నాంది కావాలని కోరుతూ “బాలల చదువు భవిష్యత్తుకు వెలుగు “కావున ఏ విద్యార్థిని విద్యార్థి బడిని మధ్యలోనే ఆపివేయకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనూష, మాధవి, ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



