Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు

పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : కామారెడ్డి జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఐపీఎస్ రాజేష్ చంద్ర  ఆదేశానుసారం జుక్కల్ హై స్కూల్ లో పోలీస్ కళాబృందం గురువారం షి టీమ్, డ్రగ్స్, సైబర్ క్రైమ్ అవేర్నెస్, వెహికిల్ అవేర్నెస్ గురించి తెలియజేయడం జరిగిందని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కళాబృందం వారిచే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి కళాబృందం వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎవరైనా ఫోన్ ద్వారా ఏటీఎం పిన్ నెంబర్ అడిగితే చెప్పకూడదని చెప్పితే ఖాతాలోని డబ్బులు మాయమవుతాయని దీనిని సైబర్ క్రైమ్ అంటారని అన్నారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆకతాయిని కొనసాగిస్తున్నారని వాటిని ఎదుర్కొనే విధంగా మహిళా పోలీసులతో ఈటీవీ ఏర్పాటు చేసి తమ సమస్యలను మహిళలకు మాత్రమే చెప్పవలసిన వి నిర్భయంగా చెప్పవచ్చునని కఠినమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు.

ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాహన చట్టాలు ఉన్నప్పటికీ యువకులు చెడు వ్యసనలకు బానిసై నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాయానిక జరుగుతున్నాయని కళాబృందం వారు ఆటపాటలతో అర్థమయ్యే రీతిలో వీక్షకులకు అందించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ జడ్పీహచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మంత్ రెడ్డి , ఉపాధ్యాయ బృందం , పోలీసు కళాబృందం సభ్యులు, జుక్కల్ పోలీస్ బృందం, జుక్కల్ జడ్.పి.హెచ్.స్ విద్యార్థిని , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad