Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు..

తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్  ఆసుపత్రులలో ప్రసవించే తల్లులకు సహకరించి తల్లిపాల ప్రాముఖ్యతను ప్రోత్సహించడం మహిళ గర్భం దాల్చినప్పటినుండి ప్రసవానంతరం బిడ్డకు  2 సంవత్సరాలు వచ్చేవరకు తీసుకొనవలసిన జాగ్రత్తలు, తల్లి పాల ప్రాముఖ్యత, పోషకాహారం మొదలైన వాటిపై గ్రామ/వార్డు /మండల స్థాయిలలో  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

ఆగస్టు 1 వ తేదీన తేదీనన 3 వ త్రైమాసికంలో ఉన్న గర్భిణీస్త్రీలు , 2 సంవత్సరాల లోపు పిల్లల, లోపపోషణ గల పిల్లల గృహ సందర్శనలు  పాలిచ్చేతల్లులకు వారి కుటుంబ సభ్యులకు బీహెచ్ఎస్ఎన్డి  ద్వారా, పీర్ గ్రూపుల ద్వారా తల్లిపాలను ముందస్తుగా ప్రారంభించి బిడ్డకు 6వ నెల వచ్చేవరకు  ప్రాధాన్యత, ఆగస్టు 2వ తేదీన  గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ,  జిల్లా ఆసుపత్రులలో, పి‌హెచ్‌సి , ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించడం , ప్రభుత్వ, ప్రైవేట్  ఆస్పత్రులలో , కార్యాలయాలలో తల్లిపాల ఆవశ్యకతను గురించి తెలిపే పోస్టర్లను  ప్రదర్శించడం, అంగన్వాడీ కేంద్రం లేదా సబ్ సెంటర్లలో సమావేశాలు నిర్వహించడం, అవగాహన కల్పించడం, ఆగస్టు 3 వ తేదీన  గ్రామ / వార్డు స్థాయిలో అన్నప్రాసనలు నిర్వహించడం, 2సం.ల వరకు తల్లిపాలను కొనసాగించడం పై అవగాహన,ఆగస్టు 5, 6 తేదీలలో  గృహాసందర్శనల ద్వారా – 6నుండి 24 నెలలవయస్సు పిల్లలున్న గృహాలు, 6 నెలల లోపు పిల్లలున్న , కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రారంభించబడిన పిల్లలున్న , లోపపోషణ ఉన్న పిల్లలున్న గృహాలను సందర్శించి తల్లిపాలు ఇచ్చే విధానం, పోషకాహారం అందించే విధానం,ఇట్టి విషయంలో భర్తల , కుటుంబ సభ్యుల పాత్రపై , వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తామని తెలిపారు.

ఆగస్టు 7వ తేదీన స్వయం సహాయక బృందాలకు సెర్ప్, మెప్మా  సభ్యుల సహాయంతో  పిల్లల, మహిళల శ్రేయస్సుకై వారోత్సవాలలోని అన్నీ అంశాలపై అవగాహన కల్పించడం కల్పిస్తామని,  ఈ వారోత్సవాలలో గర్భిణీలు, బాలింతలు కుటుంబ సభ్యులు,  అందరూ పాల్గొని కార్యక్రమమును విజయవంతం  చేయాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -