నవతెలంగాణ – భూపాలపల్లి: జిల్లాలోని బాల బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా సంక్షేమ అధికారి జి.మల్లేశ్వరి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… నవంబర్ 1 నుండి డిసెంబరు 1 వరకు నెల రోజులపాటు అవగాహన కార్యక్రమాలను జరపాలని తెలిపారు. బాల బాలికలకు, బాల్యవివాహాలు, బాల కార్మికులు, బేటి బచావో బేటి పడావో, వంటి కార్యక్రమాల పైన నెల రోజులు జిల్లాలోని ప్రతి గ్రామం, మండలంలో అవగాహన కార్యక్రమాలను పాఠశాల కళాశాలలో నిర్వహించాలని ఆ శాఖ పరిధిలో పనిచేస్తున్న డిసిపియు, సఖి, మహిళా సాధికారికత కేంద్రం విభాగాలు కలిసి నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహారహిత జిల్లాగా రూపుదిద్దడమే ధ్యేయంగా అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు అనూష, గాయత్రి , కళావతి, మమత, తిరుపతి, కుమార్, ప్రవీణ్, రామ్ చరణ్, సాయిరాం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



