నవతెలంగాణ – కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ ఇందిరా క్రాంతి భవనంలో శనివారం మహిళా సంఘాలకు,గ్రామ సంఘం ప్రతి నిధులకు, గ్రామ సంఘం సహాయకులకు అక్షరస్యతపై మండల అధికారి సాగర్ రెడ్డి మండల విద్యాధికారి విజయ్ కుమార్ ఎపిఎమ్ లక్ష్మణ్ లుమహిళలకు టాస్,ఉల్లాస్ పై అవగహన సదస్సు చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని గ్రామాల లో ఉన్న డ్వాక్రా మహిళల సంఘ సభ్యులకు ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ చదువుకునేందుకు అవకాశం కల్పించేలా చూడలని అన్నారు. అదే విదంగా ప్రతి గ్రామంలో నిరక్ష రాస్యులను గుర్తించి వారికి అక్షరాలు నేర్పేల కృషి చేసేందుకు తోడ్పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ మండల అధ్యక్షులు లక్ష్మి ఎస్ ఆర్ సిఆర్పీ లు యు లలిత, పి సుజాత,సీసీ లు దత్తాత్రి భూమన్న విఠల్ పరశురాం గంగాధర్ అమూల్ మోహన్ సి ఏ లు మహిళా సంఘ సభ్యురాలు తదితరులు ఉన్నారు.





