Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్య వివాహలు జరగకుండా అవగాహన సదస్సు

బాల్య వివాహలు జరగకుండా అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ – కన్నాయిగూడెం
మహిళలు, పిల్లల సంక్షేమశాఖ అధ్యక్షతగా, మహిళా సాధికారిక కేంద్రం, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సఖి కేంద్రం సంయుక్తంగా చైల్డ్ మ్యారేజ్ నిరోధక ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుర్రేవుల గ్రామం, కన్నాయిగూడెం మండలంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో  గ్రామ బాలల పరిరక్షణ కమిటీ (VCPC) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు హాజరై, గ్రామంలో బాలలందరికీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామ పరిధిలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ లు ఉన్నాయని వారికి తెలియజేయడం వల్ల పిల్లలసమస్యపరిష్కారమవుతుందని అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు 1098, 112 నెంబర్స్ కి ఫోన్ చేసి చెప్పొచ్చు, ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి అనీ గ్రామం కమిటీ సభ్యులందరికీ తెలియజేశారు.

బాలల హక్కులు కాపాడాలి. బాల్య వివాహ నిర్మూలన, బాలలపైనే లైంగిక వేధింపులు, బాల కార్మికత్వం నిర్మూలన, బాలల భద్రతా చర్యలు వంటి ముఖ్యాంశాలపై చర్చించారు. పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవడం, వారి రక్షణ కోసం తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు తీసుకోవాల్సిన బాధ్యతలు స్పష్టంగా తెలియజేశారు. గ్రామ బాలల రక్షణ కమిటీ ప్రతి నెలా సమావేశాలు నిర్వహించి, పిల్లల హక్కులు, సంక్షేమం, సురక్షిత వాతావరణం సృష్టించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం – బి. జ్యోతి, ఉమెన్ హబ్ –  శిరీష, సఖి కేంద్రం రాధ VCPC కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -