Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి

సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఏఎస్ఐ వెంకట్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలు బాగా పెరిగాయని, ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాట్సప్‌లో వచ్చే గుర్తుతెలియని లింక్‌లు ఓపెన్‌ చేయొద్దని అన్నారు. సైబర్‌ నేరాల్లో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమన్నారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఏ పోలీస్‌ అధికారి నేరుగా వాట్సప్‌ వీడియోకాల్స్‌ చేయరని, డిజిటల్‌ అరెస్టులు అని ఎవరైనా కాల్స్‌ వస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్‌ నేరగాళ్లకు బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారన్నారు. అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణమే 1930లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది బద్రి, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -