నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండలంలోని మేనూర్ టి జి ఎం ఎస్ పాఠశాలలో బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మద్నూర్ ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో కళాబృందం చేత సైబర్ నేరాల గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని సైబర్ నేరాలతో చాలామంది మోసపోతున్నారని తెలిపారు. మోసాలకు గురికాకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ కళాబృందం చేత సైబర్ నేరాల పట్ల ఉండవలసిన జాగ్రత్తల గురించి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల అవగాహన సదస్సులో మద్నూర్ ఎస్సై విజయ్ కొండా, తో పాటు. ఎస్సై విజయ్, హెచ్ సి తిరుపతి, పి సి ప్రవీణ్, శేషారావు, సాయిబాబా, పరశురాం, రామా గౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ శాఖ కళాబృందం ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES