Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంతి హైస్కూల్ లో నేత్రపర్వంగా అయ్యప్ప పడిపూజ

కాంతి హైస్కూల్ లో నేత్రపర్వంగా అయ్యప్ప పడిపూజ

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కాంతి హై స్కూల్ యందు శనివారం అయ్యప్ప మహా పడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించినారు. కాంతి పాఠశాల యాజమాన్యం గంగారెడ్డి, శశాంక్ రెడ్డి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజ కార్యక్రమంలో భక్తుల అయ్యప్ప నామస్పరణాలు… వేద పండితులు సుబ్బారావు మంత్రోచ్ఛారణాలతో నేత్రపర్వంగా  కొనసాగింది. నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాలకు చెందిన అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పడిపూజ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక అలంకరణ ,అభిషేకం ,పాటలు భజనలతో మారుమోగిపోయింది పాఠశాల ఆవరణ పండగ వాతావరణం నెలకొంది. స్వామి వారిని దర్శించుకొనడానికి  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఏర్పాటుచేసిన భిక్ష కార్యక్రమంలో   ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి,రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర మార్కఫైడ్ చైర్మన్ మారా గంగారెడ్డి ,మానస గణేష్, లిల్లీపుట్ రామకృష్ణ ,స్కాలర్స్ వేణు, భార్గవి విద్యానికేతన్ గోపికృష్ణ పట్వారి ,విద్య ప్రవీణ్, తులసీపట్వారి,నలంద ప్రసాద్ ,సాగర్  రోటరీ ప్రతినిధి ఎన్.వి హనుమంత్ రెడ్డి,చరణ్ రెడ్డి ,పుష్పకర్ రావు ,మంచిర్యాల సురేష్, వడ్ల శ్రీనివాస్ గురు స్వామి, కన్నె ,కత్తి, గంట గురుస్వాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -