నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్ భవన్ లో మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు మంత్రి అజారుద్దీన్ తెలిపారు. మంత్రి అజారుద్దీన్ కు సహచర మంత్రులు, పార్టీ నాయకులు అభినందనలు తెలియజేశారు.మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరిగింది. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు ఇటీవల ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశముంది.
1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో అజారుద్దీన్ జన్మించారు. 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేశారు. అజారుద్దీన్ క్రికెటర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా భాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌పార్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌ను నియమించారు.

 
                                    