Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అజ్మత్ ఖాన్‌కు సన్మానం

ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అజ్మత్ ఖాన్‌కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మగుట్టలోని మున్నూరుకాపు సంఘం ప్రాంగణంలో విద్యా రంగానికి విశేష సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌కు చెందిన నవ్య భారతి గ్లోబల్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న అజ్మత్ ఖాన్‌ను ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడుగా గుర్తించి సన్మానం చేశారు.సొసైటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు శాలువాలు, మేమంటలు, సర్టిఫికెట్లు అందజేశారు.

అజ్మత్ ఖాన్ గత 21 సంవత్సరాలుగా వ్యాయామ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ, అనేకమంది క్రీడాకారులను జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పోటీల్లో మెడల్స్ సాధించేలా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా అజ్మత్ ఖాన్, జి ఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ నరేష్, నవ భారతి గ్లోబల్ పాఠశాల చైర్మన్ సంతోష్, కరస్పాండెంట్ శ్రీదేవి లకు తన కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad