నవతెలంగాణ – కామారెడ్డి: కామారెడ్డి జిల్లా నూతన డిపిఆర్ఓ గా బి.తిరుమల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందజేయడంలో వివిధ ప్రచార మాధ్యమాలతో సమన్వయం చేస్తూ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అదిలాబాద్ జిల్లా డిపిఆర్ఓగా విధులు నిర్వహిస్తూ కామారెడ్డి జిల్లా డిపిఆర్ఓ గా ఆమె బదిలీపై వచ్చారు. ఇది వరకు ఇంచార్జి డీపీఆర్వో గా కామారెడ్డి లో పనిచేసిన రవికుమార్.. సిద్దిపేట లో పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టనున్నారు. ఇన్నిరోజులుగా తనకు సహకరించిన ప్రజాపత్రినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా నూతన డిపిఆర్ఓగా బి. తిరుమల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES