Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ గురుకులంలో బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష

మద్నూర్ గురుకులంలో బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్  : తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో మద్నూరులోని తెలంగాణ గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాలలో 6,7,8 తరగతులకు సంబంధించిన బ్యాక్ లాగ్ ప్రవేశ పరీక్ష ను ఉమ్మడి నిజామాబాదు జిల్లా కన్వీనర్ నీరడి గంగాశంకర్ నేతృత్వంలో నిర్వహించారు. 128 మంది బాలురు దరఖాస్తులు రాగా,122మంది బాలురు ప్రవేశపరీక్షను వ్రాశారని గంగాశంకర్ తెలిపారు. కేటగిరీలను బట్టి ప్రవేశ పరీక్ష మార్కుల ఆధారంగా మిగిలిన సీట్లను భర్తిచేయగలమని చెప్పారు. అంతేగాక ఆయన గురుకుల విద్యాలయమునకు సంబంధించిన  అన్ని రికార్డులను పరిశీలించారు.

బోధన సిబ్బందికి సమావేశమును  నిర్వహించారు.విద్యార్థులతో మాట్లాడారు. గురుకుల విద్యాలయము నాణ్యమైన, శాస్త్రీయమైన విద్యను అందించుచున్నదని, విద్యార్థులు బాగా కష్టపడి ఇష్టముతో చదవాలని అన్నారు. ఏకాగ్రత, పట్టుదల, దృఢ సంకల్పము వంటి సద్గుణాలను అలవర్చుకొనాలని అన్నారు. గురుకుల అధ్యాపకులు అంకితభావముతో పాఠాలను బోధించాలని సూచించారు. ఆయన వెంబడి అసిస్టెంట్ ప్రిన్సిపాల్ బచ్చు సుమన్, ఉప సంక్షేమాధికారి నరహరి ప్రసాద్, అధ్యాపకులు – డా బి. వెంకట్, జాదవ్ గణేశ్, రాము, నరేష్, బస్వరాజు, ఉపన్యాసకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -