Saturday, July 12, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..రెండు రోజులు వైన్స్‌ బంద్‌

మద్యం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌..రెండు రోజులు వైన్స్‌ బంద్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మద్యం ప్రియులకు ప్రభుత్వం షాకింగ్‌ న్యూస్‌ అందించిది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో వైన్‌ షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల ఈ నెల 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. జూన్‌ 13న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. మరుసటి రోజు అంటూ 14న (సోమవారం) రంగం, ఫలహార బండి కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్‌ చేయనున్నారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 వరకు వైన్‌ షాపులను మూసివేన్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -