Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాంధారి మండల అధ్యక్షులుగా బాధవత్ పరశురాం నాయక్     

గాంధారి మండల అధ్యక్షులుగా బాధవత్ పరశురాం నాయక్     

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి  : లంబాడ హక్కుల పోరాట సమితి  గాంధారి మండల అధ్యక్షునిగా బాధావత్ పరశురాం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపకులు భేల్లయ్య నాయక్,  రాష్ట్ర కార్యదర్శి గుగులోత్ వినోద్ నాయక్ ల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా గాంధారి మండల అధ్యక్షులు బాధవత్ పరశురాం నాయక్ ను  ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.

గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అత్యధిక గృహంలో హక్కుల పోరాట సమితి సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో వీరికి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్ నియామక పత్రాలు అందించారు. మండలంలో అన్ని కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్,  రాష్ట్ర నాయకులు సభావాత్ సదర్ నాయక్,  గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్,  వర్కింగ్ ప్రెసిడెంట్ లు జబ్బుర్ నాయక్,  శంకర్ నాయక్, యువజన జిల్లా అధ్యక్షులు ప్రేమ్ నాయక్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవి సింగ్ నాయక్, టౌన్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -