బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ సభ్యుడు యాదగిరి
నవతెలంగాణ – మిరుదొడ్డి
దళిత భోజన వాడలో బహుజన బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలని బహుజన బతుకమ్మ కమిటీ సభ్యులు యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో ఈనెల 21వ తేదీన బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని తెలిపారు. బహుజన బతుకమ్మ వేడుకల్లో బహుజన బతుకమ్మ వ్యవస్థాపకురాలు విమలక్క పాల్గొననున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 20వ తేదీ నుండి అక్టోబర్ 3 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బహుజన బతుకమ్మ వేడుకలు కొనసాగుతాయని వెల్లడించారు. బహుజన బతుకమ్మ ఉత్సవము కాదని, ఉద్యమం అంటూ చాటుదామని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలా చేయడమే బహుజన బతుకమ్మ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైతుకూరి సంఘం సభ్యులు ప్రజాసంఘాల నాయకులు ఎల్లం, నరసింహులు ,మహేందర్ ,మల్లేశం, పరశురాములు, వెంకట్, నర్సింలు ,నందు తదితరులు పాల్గొన్నారు.అనంతరం బహుజన బతుకమ్మ కరపత్రాలను నిర్వహణ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
బహుజన బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES