నవతెలంగాణ – మిరుదొడ్డి
ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్డు నిర్మాణము వ్యవసాయ పొలాలతో వద్దకు వెళ్లడానికి కలివేట్లను నిర్మాణం చేయడం జరుగుతుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భూంపల్లి గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూంపల్లి మద్దెలో గల మట్టి రోడ్డు తో ఇబ్బంది పడుతుండగా ఈరోజు చైర్మన్ వెంకటయ్య భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం ఖాజీపూర్-బేగంపేట నుండి గుర్రాలపల్లి వెళ్ళే రోడ్డు మార్గం నీటి కాలువతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సమస్య పరిష్కారానికి కల్వటు నిర్మాణం కొరకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు ఇరిగేషన్ ఈఈ శంకర్,డిప్టీ శిరీష,ఏఈ ఉదయ్,మిరుదొడ్డి ఏఈ శ్రీ నివాస్,ఇతర ప్రభుత్వ అధికారులు,భూంపల్లి సర్పంచ్ జన్నారెడ్డి,బేగంపేట సర్పంచ్ చంద్రం,ఖాజీపూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మి – చిరంజీవి,మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరి సంయుక్త-శ్రీధర్,గ్రామస్తులు ఇతరులు పాల్గొన్నారు.



