Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంత్యాగానికి ప్రతీక బక్రీద్‌

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

- Advertisement -


– ముస్లిం సోదరులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్‌ (ఈద్‌ ఉల్‌ అజ్‌) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అస్సలామ్‌, అల్లాV్‌ా ఆజ్ఞను శిరసావహించి తన కుమారుడిని సైతం బలిచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగ జరుపుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రవక్తల అచంచలమైన దైవభక్తి, త్యాగ నిరతికి బక్రీద్‌ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా, దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్‌ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటిచెపుతోందని సీఎం అభిప్రాయపడ్డారు.
శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
బక్రీద్‌ పండుగ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. బక్రీద్‌ త్యాగానికి, ఉన్నతమైన భక్తి ప్రతీక అని ఆయన తెలిపారు. ఇస్లాం విశ్వాసంలో బక్రీద్‌కు విలువైన స్థానముందనీ, పంచుకోవడం, అవసరంలో ఉన్న వారికి సాయపడటం, దయ కలిగి ఉండటం వంటితో బక్రీద్‌ సందేశం కూడుకుని ఉందని తెలిపారు. ఈ బక్రీద్‌ పండుగ సహౌదరత్వాన్ని, త్యాగాన్ని మరింత బలోపేతం చేస్తుందనీ, సమాజంలో శాంతి, సామరస్యత, సహకరం, ఐక్యతను పెంచుతుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad