Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఎన్‌ఎస్‌ఈ గంట మోగించిన బాలయ్య

ఎన్‌ఎస్‌ఈ గంట మోగించిన బాలయ్య

- Advertisement -

50 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న అరుదైన హీరోగా ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా మరో గౌరవాన్ని అందుకున్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఇ)లో బెల్‌ మోగించిన తొలి దక్షిణ భారతీయ నటుడిగా బాలకృష్ణ నిలిచారు.
ఈ అరుదైన సంఘటన ఎన్‌ఎస్‌ఈ ప్రధాన కార్యాలయాన్ని బాలకృష్ణ సందర్శించిన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు హాజరయ్యారు.
తన తల్లి స్మారకార్థంగా స్థాపించబడిన బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌కు ఇన్నేళ్లుగా అండగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా వేలాది మంది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రపంచ స్థాయి క్యాన్సర్‌ వైద్యం అందేలా బాలకృష్ణ కషి చేస్తున్నారు. అటు నటుడిగా, ఇటు ప్రజా సేవకుడిగా, ప్రజా నాయకుడిగా విశిష్ట సేవలు అందిస్తున్న బాలకృష్ణకు ఈ గౌరవం దక్కడం తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కొనియాడారు.
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తున్నారు. పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో బాలకృష్ణ అలరించనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad