– మంత్రి పదవి కాపాడుకోవడం కోసమే అక్రమకేసు అని వ్యాఖ్య
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
ప్రజాతీర్పును గౌరవించకుండా దౌర్జన్యం, దాడులు చేసి మంత్రి వివేక్ తనపై, బీఆర్‌ఎస్ నాయకు లపై అక్రమ కేసులు బనా యించి జైలుకు పంపిం చారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఫిబ్రవరి 18న మంత్రి వివేక్ క్యాన్వారుపై జరిగిన దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న ఆయనతో పాటు బీఆర్‌ఎస్ నాయకులకు మంచిర్యాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం బాల్క సుమన్ జైలు నుంచి విడుదల కాగా మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ నాయకులు పూల వర్షం కురిపిస్తూ గజమాలతో సత్కరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, సీపీఐ కలిసి పోటీ చేసినట్టు చెప్పారు. 22 వార్డులకుగాను 14 వార్డులు బీఆర్‌ఎస్, సీపీఐ కూటమి గెలిచిందన్నారు. ఏడు సీట్లు సాధించిన కాంగ్రెస్.. చైర్మెన్ పదవి కోసం మంత్రి వివేక్ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. తమ 14 మంది కౌన్సిలర్లు భద్రాచలంలో ఉంటే పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే యత్నం చేయగా.. తాను వెళ్లి వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి చెన్నూర్‌లోని తన నివాసంలో ఉంచామని తెలిపారు. 16న చైర్మెన్ ఎన్నికను పోలీసులు అడ్డుకుని వాయిదా వేశారన్నారు. 17న కూడా పోలీసులతో తమకు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. మున్సిపాల్టీకి 2 కిలోమీటర్ల దూరంలో తనతో పాటు బీఆర్‌ఎస్ ఎన్నికల పరిశీలకులు కోవ లక్ష్మీని పోలీసులు నిలువరించారని తెలిపారు. కానీ మంత్రి క్యాన్వారును, వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలను పంపిస్తే తాము ప్రశ్నించినందుకు తమపై లాఠీచార్జి చేయడంతోపాటు కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ తమపైనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. 16 రోజులుగా తనకు బెయిల్ రాకుండా అనేక కుయుక్తులు పన్నా రన్నారు. 5న తన చిన్న కొడుకు జన్మదినం ఉందని, ఆ సమయంలో కుటుంబ సభ్యులతో ఉండనివ్వకుండా పైశాచిక ఆనందం పొందాలని చూశారన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతోపాటు లాయర్ల కృషి ఫలితంగా తాను బయటకు వచ్చానని తెలిపారు.
జైలు నుంచి బాల్క సుమన్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



