Saturday, September 20, 2025
E-PAPER
Homeజాతీయం474 రాజకీయపార్టీలపై వేటు

474 రాజకీయపార్టీలపై వేటు

- Advertisement -

కేంద్ర ఎన్నికల సంఘం చర్య
ఆరేండ్లలో ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగని వైనం

న్యూఢిల్లీ : చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా గుర్తింపు పొందని 474 రాజకీయ పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగించింది. 2019 నుంచి ఆరేండ్లలో ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగని రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది. పేరుకు పార్టీలు పెట్టినప్పటికీ వీటికి భౌతికంగా ఎలాంటి కార్యలయాలు లేవని వెల్లడించింది. ఇటీవలే 334 పార్టీలను రద్దు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మరో రౌండ్‌లో 474 పార్టీలను గుర్తించి వేటు వేసింది. గత రెండు నెలల వ్యవధిలో 808 రాజకీయ పార్టీలను ఈసీ రద్దు చేసింది. ఇప్పటి వరకు 2,520 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు ఉండగా, తాజా తొలగింపుతో ఆ సంఖ్య 2,046కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -