Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ గ్రామ కాంగ్రెస్ యూత్ నూతన అధ్యక్షునిగా బండిగోపి

మద్నూర్ గ్రామ కాంగ్రెస్ యూత్ నూతన అధ్యక్షునిగా బండిగోపి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ నూతన అధ్యక్షునిగా బండి గోపి ఎంపికయ్యారు. జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుని పేరును ప్రకటిస్తున్నట్లు మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బండి గోపి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఎమ్మెల్యేకు మండల పార్టీ అధ్యక్షునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ యూత్ బలోపేతానికి ప్రత్యేకంగా కృషి చేస్తానని ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలకు గ్రామ వార్డు సభ్యులను సర్పంచును గెలుపు కోసం యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -