నవతెలంగాణ-హైదరాబాద్: రైతుల సాధికారత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతదేశ బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యతగా ఉండాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మంగళవారం తమిళనాడులోని చెన్నైలో జరిగిన సిటీ యూనియన్ బ్యాంక్ 120వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. స్టార్టప్‌ల నుండి స్మార్ట్ సిటీల వరకు, MSMEలను వృద్ధి ఇంజిన్‌లుగా మార్చడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఆర్థిక సేవల రంగంలో పురోగతి ఉన్నప్పటికీ, డిజిటల్ అక్షరాస్యత, ఇంటర్నెట్ యాక్సెస్, ఆర్థిక అవగాహన పరంగా ఇప్పటికీ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి.” చెల్లింపు బ్యాంకులు, డిజిటల్ వాలెట్లు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు మారుమూల గ్రామాలకు ఆర్థిక సేవలను విస్తరించాయని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతకుముందు చెన్నైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్వాగతించారు.