Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా బరిగెల వెంకటయ్య

అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా బరిగెల వెంకటయ్య

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు అంబేద్కర్ ఉత్సాహ కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అంబేద్కర్ సంఘ మండల అధ్యక్షులు దేవయ్య తెలిపారు. ఉత్సాహ కమిటీ గౌరవ అధ్యక్షులుగా బాలయ్య, అధ్యక్షులుగా బరిగెల వెంకటయ్య, ఉపాధ్యక్షులు బుచ్చయ్య, మావిళ్ళ వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి బరిగెల వెంకట్ సాగర్, కోశాధికారి బరిగెల సుదర్శన్, సహాయ కార్యదర్శి బరిగెల దేవరాజ్, ప్రచార కార్యదర్శి బరిగల రవీంద్ర, సలహాదారులుగా బరిగెల దానియల్ , బరిగెల రాములు, బరిగెల వెంకటయ్య, ఎర్రోళ్ల మల్లేష్ మన్యం, కురుమయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు బర్గెల వెంకటయ్య మాట్లాడుతూ.. మండలంలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ, ఓసి కులాలను కలుపుకొని విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. అంబేద్కర్ అన్ని వర్గాల కోసం రాజ్యాంగాన్ని రాశారని ఆయన తెలిపారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు, మండల కేంద్రంలో నిరుద్యోగుల కోసం గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సహకారంతో నూతన భవనం కూడా నిర్మిస్తామని చెప్పారు. ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు విగ్రహ ఏర్పాటు కోసం సహకారం అందించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -