Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్Basara IIIT: బాసర ఐఐఐటీలో సీట్లు సాధించిన కాటాపూర్ విద్యార్థులు

Basara IIIT: బాసర ఐఐఐటీలో సీట్లు సాధించిన కాటాపూర్ విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన ఇద్దరూ విద్యార్థులకు బాసరలోని ఐఐఐటీలో (Basara IIIT) ప్రవేశం లభించింది. ఈ మేరకు జడ్.పి.హెచ్.ఎస్ కాటాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానాల సుధాకర్ తెలిపారు. ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు చాలా పోటీ ఉన్నప్పటికీ తమ విద్యార్థులు ప్రతిభతో నిలబడ్డారని చెప్పారు. కే శ్వేత, ఎస్.కె నిజాముద్దీన్ విద్యార్థులు సీట్లు సాధించారన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడం పట్ల పాఠశాల, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గ్రామస్థులు గర్వపడుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ‘మా పాఠశాలలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి అవకాశాలు కలగాలని, విద్యతో పాటు విలువలపై దృష్టి పెట్టే విద్యా విధానం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -