వరదల నుండి ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..
నవతెలంగాణ – ముధోల్
గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో బాసర మండలంలోని ఆయా గ్రామాల్లో వరద ప్రభావంపై బాసర తహసిల్దార్ పవన్ చంద్ర, ఎస్ఐ శ్రీనివాస్ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి పలువురిచే శభాష్ అనిపించుకుంటున్నారు. ఒకపక్క బాసర పుణ్యక్షేత్రంలో బాసర గోదావరి ఉధృతి పెరగడంతో ముందు రోజు బాసర గోదావరి స్థాన ఘట్టాలను పరిశీలించారు. భక్తులు ఎవరిని అనుమతించవద్దని ముందే సూచించారు. దీంతో ఎవరి ని అటు వైపు అనుమతించలేదు. శుక్రవారం మహారాష్ట్రలో వర్షాలతో డ్యాములు నిండిపోయి గేట్లు తెరవడంతో బాసర గోదావరి ఉధృతంగా ప్రవహించింది. దీంతో బాసర సరస్వతి ఆలయం పరిసరాల వరకు వరద నీరు చేరింది. ఆలయ పరిసరాల్లో ఉన్న లాడ్జిలు పలు నివాస గృహాలు, దుకాణాల చుట్టూ భారీగా వరద నీరు చేరింది.
దీంతో వెంటనే వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాల తరలించడానికి పోలీస్ శాఖ , రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా బాసరను సందర్శించి వరదల్లో చిక్కుకున్న వారి కోసం ట్రాక్టర్ పై వేళ్ళి వారిని పరామర్శించారు. వెంటనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్ డి ఆర్ ఎఫ్) బృందం సభ్యులు బాసరకు చేరుకొని ప్రత్యేక బోట్ల ద్వారా వరధ నీటి లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. బాసర తోపాటు బిద్రెల్లి వాగుతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతా గ్రామాలు ఉండటంతో గత రెండు రోజులుగా వరద నీరు పోటెత్తాడంతో తహసిల్దార్, ఎస్ఐ తన సిబ్బంది ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఒకపక్క ఎప్పటికప్పుడు వరద తీవ్రతను, సమస్యలను సబ్ కలెక్టర్ , జిల్లా కలెక్టర్ , ఎస్పీ, అడిషనల్ ఎస్పీకీ వివరిస్తూ , ఇక్కడి సమాచారం చేరవేశారు. గత రెండు రోజులుగా రెవెన్యూ , పోలిస్ శాఖ వారు నిరంతరం విధుల్లో ఉంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.
బాసర తహశీల్దార్.. ఎస్ఐ సేవలు భేష్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES