Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆటలుజులై 3 నుంచి బాస్కెట్‌బాల్‌ లీగ్‌

జులై 3 నుంచి బాస్కెట్‌బాల్‌ లీగ్‌

- Advertisement -

హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ సరికొత్త శకంలోకి అడుగుపెడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బాస్కెట్‌బాల్‌కు ఆదరణ తీసుకురావటంతో పాటు ప్రొఫెషనల్‌ స్థాయిలో అభివృద్ది చేసేందుకు జులై 3 నుంచి 6 వరకు తెలంగాణ ప్రొ బాస్కెట్‌ లీగ్‌- ప్రీ సీజన్‌ నిర్వహిస్తున్నారు. తెలంగాణ హాక్స్‌, రంగారెడ్డి రైహినోస్‌, వరంగల్‌ వారియర్స్‌, కరీంనగర్‌ కింగ్స్‌, నిజామాబాద్‌ నవాబ్స్‌, మహబూబ్‌నగర్‌ బుల్స్‌ జట్లు టీపీబీఎల్‌ ప్రీ సీజన్‌లో పోటీపడతాయని తెలంగాణ బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు రావుల శ్రీధర్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇటీవల మాల్దీవుల్లో జరిగిన దక్షిణాసియా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అండర్‌-16 గర్ల్స్‌ క్వాలిఫయర్స్‌లో పోటీపడిన తెలంగాణ అమ్మాయిలు నేత్ర, శాన్వి, విహాలను శ్రీధర్‌ రెడ్డి సన్మానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad