Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

రవీంద్రభారతిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

- Advertisement -

హాజరైన మంత్రి సీతక్క

నవతెలంగాణ-కల్చరల్‌
తెలంగాణ రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బతుకమ్మ సంబరాలు ఆరో రోజు ఘనంగా సాగాయి. తెలంగాణ సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక సారథి కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. పూల సోయగాలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ మహిళలు సంప్రదాయ గీతాలతో వాతావరణాన్ని ఆహ్లాద పరిచారు ఈ వేడుకలకు మంత్రి సీతక్క హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక అన్నారు. శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి కళాకారులను అభినందిస్తూ, తెలంగాణ సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -