Tuesday, September 16, 2025
E-PAPER
Homeజిల్లాలుబతుకమ్మ శుభాకాంక్షలు..మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిసి ఉషారాణి భోజన్న

బతుకమ్మ శుభాకాంక్షలు..మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిసి ఉషారాణి భోజన్న

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులు చిన్న, పెద్దలు కలిసి ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళ లబ్ధిదారూలకి రెండు ఇందిరమ్మ చీరలు ఉచితంగా ఇవన్నట్లు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిసి ఉషారాణి భోజన్న తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6000 పైచిలుకు చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ.. సిరిసిల్ల చేనేత కార్మికుల చేత 65 లక్షల చీరలు తయారీకి ఆర్డర్ ఇచ్చిందని తెలియ‌జేశారు. మొత్తం 318 కోట్ల ఖర్చుతో దాదాపు తొమ్మిది కోట్ల మీటర్ల బట్టల తయారీకి అనుమతి ఇచ్చిందని, ఇప్పటికే 36 లక్షల చీరలు సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. ప్రతిచీర విలువ సుమారు 800/- రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం తో తెలంగాణ ఆడపడుచులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత గౌరవం ఉందో దీనితో రుజువైందన్నారు.

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని, ఆయన పదవిలో లేకున్నా ఎంతో చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తూ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. రాబోవు రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని ఆమె తెలిపినారు. బతుకమ్మ చీరలు పొందుతున్న ప్రతి మహిళకు ఆమె బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -