- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 28న గిన్నిస్ రికార్డ్ లక్ష్యంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బతుకమ్మ వేడుకలను పర్యాటక శాఖ వాయిదా వేసింది. వర్షాలు కురుస్తాయన్న IMD హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని ఈనెల 29న సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ వేడుకల్లో 50 అడుగులకు పైగా ఎత్తుతో బతుకమ్మను ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు.
- Advertisement -